లా విద్యార్థులకు మనుస్మృతి బోధించాలి
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:12 AM
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లా విద్యార్థులకు జైనిజం, బుద్ధిజం, మనుస్మృతి లేదా అర్థశాస్త్ర సూత్రాలను ....
జైనిజం, బుద్ధిజం, అర్థశాస్త్రం చెప్పాలి: మద్రాస్ హైకోర్టు సీజే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లా విద్యార్థులకు జైనిజం, బుద్ధిజం, మనుస్మృతి లేదా అర్థశాస్త్ర సూత్రాలను తప్పనిసరిగా బోధించాలని ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. దేశంలోని జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలు సమకాలీనుల కంటే ఎంతో ముందంజలో ఉన్న మేధావులను తీర్చిదిద్దుతున్నాయని, కానీ అత్యంత వేగంగా కోటీశ్వరులుగా మారడమే వీరి అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. లా పట్టభద్రులలో చాలామంది సాంస్కృతిక, సైద్ధాంతిక మూలాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. వారి ఆలోచనా విధానంలో స్థిరత్వం, పరిపక్వత తీసుకురావడమే గాక, మన కర్తవ్యాలు, కర్మ పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించేలా సహజ సిద్ధమైన గొప్ప భారతీయ సంస్కృతి గురించి బోధించాలని నొక్కి చెప్పారు. అన్ని లా కాలేజీల్లో వీటిపై ప్రత్యేక కోర్సు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.