‘హోర్మూజ్’పై మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:42 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీతో గురువారం ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీతో గురువారం ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు స్వేచ్ఛ, భద్రత పున రుద్ధరించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దాదాపు 50రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తోందని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్, ఫ్రాన్స్ దేశాలు తమ సన్నిహిత సహకారాన్ని కొనసాగిస్తాయని, తమ సంభాషణ వివరాలను మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు మార్చి 5న కూడా మోదీ, మాక్రాన్‌లు ఫోన్లో చర్చలు జరిపారు.