తదుపరి ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:37 AM
భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం...
న్యూఢిల్లీ, జూన్ 13: భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం ఈ నెల 30న ముగుస్తుంది. అదే రోజున ధీరజ్ సేథ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీవోఏఎస్)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ధీరజ్ సేథ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఖడక్‌వాస్లా (మహారాష్ట్ర) లోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 1986 డిసెంబరులో భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన విశేష సేవలందించారు. సైనిక దళాల ఆధునీకరణకు ఆయన చేసిన కృషికి విస్తృత గుర్తింపు లభించింది. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ గతంలో జమ్మూకశ్మీర్‌లో ఒక సాయుధ రెజిమెంట్‌కు, సాయుధ బ్రిగేడ్, తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేశారు. అదేవిధంగా భారత సైన్యంలో ప్రతిష్టాత్మక సుదర్శన చక్ర కార్ప్స్ దళానికి నాయకత్వం వహించారు.