ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లు తగ్గుముఖం
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:32 AM
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌కు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలు చెలరేగి వినియోగదారులు ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఎగబడిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, మార్చి 15: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌కు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలు చెలరేగి వినియోగదారులు ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఎగబడిన విషయం తెలిసిందే. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్స్ భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు బుకింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. గత శుక్రవారం (13న) 88.8 లక్షల ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్స్ జరగ్గా శనివారం దాదాపు 77 లక్షలకు తగ్గినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఎల్‌పీజీ బుకింగ్స్ వాటా 84 శాతం నుంచి 87 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కాగా దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పని చేస్తున్నాయని, సరిపోయేంతగా క్రూడ్ ఆయిల్ నిల్వలను నిర్వహిస్తున్నాయని వివరించింది.