ఇప్పటి వరకూ లేని వారికే ఎల్‌పీజీ ఈ-కేవైసీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:58 AM
ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీపై కేంద్ర ఇంధన శాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకూ ఈ-కేవైసీ చేయించుకోని వారు మాత్రమే తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 17: ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీపై కేంద్ర ఇంధన శాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకూ ఈ-కేవైసీ చేయించుకోని వారు మాత్రమే తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన(పీఎంయూవై) లబ్ధిదారులతో పాటు 33 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకూ ఈ-కేవైసీ చేయించుకోని వారు మాత్రమే తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, పీఎంయూవై కింద కొత్త ఎల్పీజీ కనెక్షన్ తీసుకునే వారికి ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని తెలిపింది.