సిలిండర్ రేటు రూ.29 పెంపు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:09 AM
గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. రూ.29 మేర పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి.
ధరల పెంపు గత మూడు నెలల్లో రెండోసారి
న్యూఢిల్లీ, జూన్ 6: గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. రూ.29 మేర పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపాయి. తాజా పెంపుదలతో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.913 నుంచి రూ.942కి పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది. ఇళ్లల్లో ఉపయోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచటం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఎల్‌పీజీ దిగుమతులు క్షీణించిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 7వ తేదీన చమురు సంస్థలు సిలిండర్ మీద రూ.60 మేర పెంచాయి.