Share News

లవ్‌లీ యూనివర్సిటీకి 10రోజుల సెలవు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:23 AM

పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా పగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయం(ఎల్పీయూ)లో పరిస్థితులు మాములు స్థితికి చేరుకుంటున్నాయి.

లవ్‌లీ యూనివర్సిటీకి 10రోజుల సెలవు
lovely university

పగ్వారా, సెప్టెంబరు 28: పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా పగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయం(ఎల్పీయూ)లో పరిస్థితులు మాములు స్థితికి చేరుకుంటున్నాయి. బయటి వ్యక్తి ఒకరు క్యాంప్‌సలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్నట్లుగా ఆదివారం ఆరోపణలు గుప్పుమనడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహోదగ్రులయ్యారు. అదేరోజు రాత్రి విద్యార్థుల్లో కొందరు క్యాంపస్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 15గంటల పాటు హైవేను దిగ్బంధించారు. సోమవారానికి వర్సిటీలో పరిస్థితులు చల్లబడ్డాయి. అధికారులు క్యాంప్‌సలో తరగతులను నిలపివేసి, పరీక్షలను వాయిదా వేశారు. సోమవారం నుంచి క్యాంప్‌సకు 10 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు బ్యాగలు సర్దుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.

Updated Date - Sep 29 , 2026 | 05:28 AM