Share News

824 సీట్లు!

ABN , Publish Date - Nov 30 , 2026 | 02:37 AM

ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్య 543. అన్ని రాష్ట్రాల్లోనూ 50శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచాలన్న కేంద్రం నిర్ణయం ప్రకారం.. 543లో సగం 271.5 అవుతుంది.

824  సీట్లు!

  • 50శాతం పెంపు అంటే అవ్వాల్సింది 815 సీట్లే

  • కొన్ని రాష్ట్రాల్లో బేసి సంఖ్యలో నియోజకవర్గాలు

  • వాటిలో కచ్చితంగా సగానికి సగం పెంపు కష్టం

  • అక్కడ సర్దుబాటుతో 824కు పెరగనున్న సీట్లు

న్యూఢిల్లీ, నవంబరు 29: ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్య 543. అన్ని రాష్ట్రాల్లోనూ 50శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచాలన్న కేంద్రం నిర్ణయం ప్రకారం.. 543లో సగం 271.5 అవుతుంది. అంటే 814.5 కావాలి. అరసీటు పెంచడం కుదరదు కాబట్టి.. సీట్ల సంఖ్యను 815 అవుతుందని అంతా అంచనా వేశారు. శనివారం దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు, టీవీ చానళ్లలో.. పెరిగే స్థానాల సంఖ్య 816గా చూపారు. అయితే.. దిగువ సభ బలం 824కు చేరవచ్చని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. దీనికి కారణం.. కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు బేసి సంఖ్యలో ఉండడమే. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 25. అందరికీ ఒకే నిష్పత్తిలో 50శాతం పెంపు అనే సూత్రం ప్రకారం పెంచాలంటే.. 25లో సగం 12.5. అంటే 37.5. అలా కుదరదుగనక ఏపీలో సీట్ల సంఖ్యను 38కి పెంచారు. అలాగే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో సగం 8.5.. అంటే 25.5 సీట్లు. అలా కుదరదు గనుక తెలంగాణలో సీట్ల సంఖ్యను 26కు సవరించారు. ఇదే పరిస్థితి మరికొన్ని రాష్ట్రాల్లో ఉండడంతో అన్నీ కలిపి సీట్ల సంఖ్య 824కు పెరిగే అవకాశం ఉందని అంచనా.

Updated Date - Nov 30 , 2026 | 02:40 AM