లోక్‌సభ వాయిదా.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం చర్చ
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:25 AM
లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించారు.
న్యూఢిల్లీ, మార్చి 9: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నెల రోజుల తర్వాత సోమవారం ఉదయం తిరిగి ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ సభ్యులు ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ వెంటనే సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. చర్చ పూర్తయ్యేవరకు సభకు దూరంగా ఉండాలని ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎంపీలకు ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు విప్ జారీ చేశాయి. బుధవారం వరకు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని 3 లైన్ విప్ జారీ అయింది.