పెద్ద రాష్ట్రాలపై ప్రభావం నిల్
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:48 AM
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే నిష్పత్తిలో 50 శాతం మేర లోక్సభ స్థానాలను పెంచాలన్న కేంద్రం నిర్ణయంతో.. పెద్ద రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం పడదు.
అతి స్వల్పతేడాలు మినహా అదే ప్రాతినిధ్యం
చిన్న రాష్ట్రాలు, యూటీల ప్రాతినిధ్యంలో భారీ తేడా
న్యూఢిల్లీ, నవంబరు 29: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే నిష్పత్తిలో 50 శాతం మేర లోక్సభ స్థానాలను పెంచాలన్న కేంద్రం నిర్ణయంతో.. పెద్ద రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం పడదు. అతి స్వల్ప తేడాలు మినహా దాదాపుగా అన్ని రాష్ట్రాలకూ ప్రస్తుతం లోక్సభలో అదే ప్రాతినిధ్యం ఉంటుంది. ఉదాహరణకు.. తమిళనాడుకు ప్రస్తుతం లోక్సభలో 39 మంది సభ్యులున్నారు. 543 మందిలో 39 అంటే.. ప్రతి 100 సీట్లలో 7.18 శాతం ప్రాతినిధ్యం ఉన్నట్టు. ఇప్పుడు సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే 59 సీట్లవుతాయి. 824 మందిలో 59 మంది అంటే.. ప్రతి 100 సీట్లలో 7.16 శాతం. తేడా అత్యంత స్వల్పం. యూపీ ప్రాతినిధ్యం కూడా 0.17శాతం మేర తగ్గుతుంది. ఏపీ (ప్రస్తుతం 4.60; పెంపుతో 4.61), తెలంగాణ (ప్రస్తుతం 3.13శాతం; పెంపుతో 3.16) ప్రాతినిధ్యంలో కూడా అంతే. అతి స్వల్ప తేడా. కానీ.. కొన్ని చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం మాత్రం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు.. చండీగఢ్, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, పుదుచ్చేరి.. వీటన్నింటి ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న 0.1శాతం నుంచి 0.24శాతానికి పెరుగుతుంది. అదే సమయంలో.. ఇప్పటికే 1-2 సీట్లుండి, పునర్విభజనలో పెరగని రాష్ట్రాలు, యూటీల ప్రాతినిధ్యం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు.. దా ద్రానగర్ హవేలీ, డయ్యు, డామన్లకు రెండేసి సీట్లున్నాయి. పునర్విభజనలో అవి పెరగట్లేదు. 543లో 2 సీట్లు అంటేనే.. 0.37శాతం ప్రాతినిధ్యం. అలాంటిది సీట్ల సంఖ్య 824కు పెరిగితే ఆ ప్రాతినిధ్యం 0.13శ మేర తగ్గిపోయి 0.24 శాతానికి పడిపోతుంది.