Share News

దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:15 AM

భారతీయ దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: భారతీయ దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1942 డిసెంబరు 18న పంజాబ్‌లోని ఝంగ్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించిన రాయ్‌.. సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో 23 ఏళ్ల వయసులోనే కెమెరా పట్టారు. 1966లో ది స్టేట్స్‌మ్యాన్‌ న్యూస్‌పేపర్‌లో చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1972లో బంగ్లాదేశ్‌ యుద్ధ శరణార్థుల సంక్షోభ పరిస్థితులు, 1984లో భోపాల్‌ గ్యాస్‌ విషాదంతోపాటు భారత ఆధునిక చరిత్రలోని కొన్ని అత్యంత ముఖ్యమైన ఘటనలను ఆయన తన కెమెరాలో బంధించారు. బంగ్లాదేశ్‌ యుద్ధం దాని పర్యవసానాలపై తన కవరేజీకిగాను 1972లో రాయ్‌.. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 04:15 AM