Share News

ఇరాన్‌పై అణుదాడి చేసే పరిస్థితులు కల్పించింది ఐరాసనే

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:04 AM

ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ సంస్థ దౌత్యవేత్త పదవికి లెబనాన్‌కు చెందిన మహమ్మద్‌ సఫా రాజీనామా చేశారు.

ఇరాన్‌పై అణుదాడి చేసే పరిస్థితులు కల్పించింది ఐరాసనే

న్యూఢిల్లీ,మార్చి30: ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ సంస్థ దౌత్యవేత్త పదవికి లెబనాన్‌కు చెందిన మహమ్మద్‌ సఫా రాజీనామా చేశారు. ఇరాన్‌పై అణుబాంబులు వేసే అవకాశం ఉందని, ఐరాసయే ఈ పరిస్థితులను కల్పిందని ఆరోపించారు. ఐరాస ఆర్థిక, సామాజిక మండలికి ఆయన సలహాదారుగా ఉన్నారు. పర్యావరణ అంశాలపై ఆ మండలికి పేట్రియాటిక్‌ విజన్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయిన సఫా దాని తరఫున ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:04 AM