అతి వద్దు.. హుందాగా ఉండండి
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:24 AM
ఇటీవల సివిల్ సర్వీసె్‌సకు ఎంపికైన అభ్యర్థులు సోషల్ మీడియాలో స్వీయ ప్రచారం, వివాదాస్పద పోస్టులకు దూరంగా ఉండాలని సివిల్స్ శిక్షణ అకాడమీ ఎల్‌బీఎస్ఎన్‌ఏఏ సూచించింది.
సోషల్ మీడియాలో స్వీయ ప్రచారం వద్దు
సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు పాలన అకాడమీ సూచనలు
న్యూఢిల్లీ, మార్చి 17: ఇటీవల సివిల్ సర్వీసె్‌సకు ఎంపికైన అభ్యర్థులు సోషల్ మీడియాలో స్వీయ ప్రచారం, వివాదాస్పద పోస్టులకు దూరంగా ఉండాలని సివిల్స్ శిక్షణ అకాడమీ ఎల్‌బీఎస్ఎన్‌ఏఏ సూచించింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రవర్తనతో హుందాగా వ్యవహరించాలని కోరింది. సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణనిచ్చే లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ (ఎల్‌బీఎస్ఎన్‌ఏఏ) ఈ మేరకు స్పష్టమైన అడ్వైజరీ జారీచేసింది. వాణిజ్య, సంస్థాగత సిఫారసుల నుంచి వృత్తిపరమైన దూరం పాటించాలని అందులో సూచించింది. భవిష్యత్తు పౌర సేవకులుగా మీరు అన్ని సందర్భాల్లోనూ ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నామని అకాడమీ తెలిపింది. ఒక అధికారి విశ్వసనీయత వారి నిజాయితీపై ఆధారపడి ఉంటుందని.. బహుమతులు, ఆతిథ్యం, ఉచిత ప్రచారం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఇటీవల యూపీఎ్‌ససీ విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 958 మంది సివిల్స్ సర్వీసె్‌సకు ఎంపికయ్యారు.