Lawyers Should Not Use RTI: క్లయింట్ల కోసం లాయర్లు స.హ.చట్టాన్ని వాడొద్దు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:47 AM
తమ క్లయింట్ల కేసులకు సంబంధించిన వివరాల కోసం న్యాయవాదులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోకూడదని కేంద్ర సమాచార కమిషన్...
న్యూఢిల్లీ, జనవరి 18: తమ క్లయింట్ల కేసులకు సంబంధించిన వివరాల కోసం న్యాయవాదులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోకూడదని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. ఇలా చేయడం సమాచార హక్కు చట్టం ఆశయాలకే విరుద్ధమని తెలిపింది. హరియాణాలోని నవోదయ పాఠశాలలకు పళ్లు, కూరగాయల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టును రద్దు చేయడానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ ఓ న్యాయవాది చేసిన వినతిపై ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. కాంట్రాక్టు కోల్పోయిన సోదరుడి తరఫున ఆ న్యాయవాది దరఖాస్తు చేయడాన్ని సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి ప్రశ్నించారు. లాయర్ క్లయింట్ తరఫున సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయకూడదన్న మద్రాసు హైకోర్టు తీర్పును గుర్తు చేశారు.