New FASTag from February 1: ఫిబ్రవరి 1 నుంచి అన్ని కొత్త కార్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:57 AM
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని కొత్త కార్లు, జీప్‌లు, వ్యాన్లకు జారీ చేసే ఫాస్టాగ్‌లకు తప్పనిసరి నో యువర్ వెహికిల్ ...
జీప్‌లు, వ్యాన్ల ఫాస్టాగ్‌లకు కేవైవీ నిలిపివేత
న్యూఢిల్లీ, జనవరి 1: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని కొత్త కార్లు, జీప్‌లు, వ్యాన్లకు జారీ చేసే ఫాస్టాగ్‌లకు తప్పనిసరి నో యువర్ వెహికిల్ (కేవైవీ) ప్రక్రియను నిలిపివేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. తాజా సంస్కరణతో లక్షలాది మంది వాహనదారులకు ఊరట కలగనుంది. వాహనానికి సంబంధించి అన్ని చెల్లుబాటయ్యే పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియలో జాప్యం కారణంగా వాహనదారులు ఇబ్బందిపడుతున్నట్టు గుర్తించి తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కేవైవీ అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.