బలిసిన దళితుడా.. మరెంతకాలం రిజర్వేషన్?
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:24 AM
కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే కుటుంబంపై ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట సిద్దార్థ సంస్థ ద్వారా లూటీ చేసి..
ఖర్గే కుటుంబంపై ఎక్స్‌లో కుమార పోస్టు
బెంగళూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే కుటుంబంపై ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట సిద్దార్థ సంస్థ ద్వారా లూటీ చేసి, బలిసిన దళితుడా.. నీకు, నీ తండ్రికి మరెంతకాలం రిజర్వేషన్ నియోజకవర్గాలు కావాలి?’ అంటూ కుమారస్వామి ప్రశ్నించారు. స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై గురువారం మధ్యాహ్నం వరకూ ఆందోళనలు, ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. అంతటితో ఆగలేదు. సాయంత్రం ఎక్స్‌లో మరింత రెచ్చిపోయారు. ‘సిద్దరామయ్యకు వ్యతిరేకంగా జరిగిన స్టింగ్ ఆపరేషన్‌లో భాగస్వామిగా మారావు. ఆయ న సీఎం పదవి కోల్పోయేందుకు కారకుడైన నీలికళ్ల మంత్రి ప్రియాంక ఖర్గే.. స్టింగ్ సూత్రధారులను వదిలి.. అమాయకుల వెంటపడతావా?. హోంమంత్రి పదవికి నువ్వు అనర్హుడివి. స్టింగ్ ఆపరేషన్ సిండికేట్‌లో నువ్వూ భాగస్వామివే. ఈ విషయంలో నాకు స్పష్టత ఉంది’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.