Share News

దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు కిషన్‌రెడ్డి విందు

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:22 AM

దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే పార్లమెంటు సభ్యులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో..

దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు కిషన్‌రెడ్డి విందు

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే పార్లమెంటు సభ్యులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఈ ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల వారు మినహా తెలంగాణ, తమిళనాడు, కేరళం ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు, కూటమి ఎంపీల మధ్య సమన్వయంపై వారు చర్చించినట్లు సమాచారం.

Updated Date - Nov 30 , 2026 | 03:26 AM