Share News

తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకు రుణం

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:22 AM

దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తేవడానికి ఆర్బీఐ కిసాన్‌ క్రెడిట్‌...

తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకు రుణం

  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రూల్స్‌ సవరణ.. వచ్చే ఏడాది అమల్లోకి

న్యూఢిల్లీ, జూన్‌ 20: దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తేవడానికి ఆర్బీఐ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్ప కాలిక పంట కాలాన్ని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట కాలాన్ని 18 నెలలుగా ఖరారు చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రైతు తీసుకునే రూ.2 లక్షల్లోపు రుణాలకు తాకట్టు, మార్జిన్‌ మనీ, అదనపు సెక్యూరిటీ నిబంధనలను ఎత్తేసింది. ఇంతకుముందు ఈ రుణ పరిమితి రూ.1.60 లక్షలుగా ఉండేది. ఇక పంటలు, పశు సంపద ఆధారంగా తీసుకునే రుణాలకు సంబంధించి రూ.3 లక్షల వరకు తాకట్టు నిబంధనను బ్యాంకులు మాఫీ చేసే అవకాశం కల్పించారు. అయితే దీనిపై తుది నిర్ణయం బ్యాంకుల అంతర్గత రుణ విధానాలపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - Jun 21 , 2026 | 04:22 AM