భారత్‌ను అవమానిస్తే నవ్వుతారా?
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:40 AM
భారత్‌ను విదేశీయులు అవమానిస్తుంటే ఎవరైనా నవ్వుతారా? అంటూ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీపై కిరెన్ రిజిజు పరోక్ష విమర్శలు
న్యూఢిల్లీ, నవంబరు 15: భారత్‌ను విదేశీయులు అవమానిస్తుంటే ఎవరైనా నవ్వుతారా? అంటూ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్-2026లో ఇటలీ రాజకీయ నేత, యూరోపియన్ సోషలిస్టుల పార్టీ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్ ‘ఓటు చోర్.. గద్దీ ఛోడ్’అంటూ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ నవ్వుతూ చప్పట్లు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన రిజిజు..‘‘విదేశీయులు భారత్‌ను అవమానిస్తున్నప్పుడు ఎవరైనా నవ్వడం చూశారా? విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానించే భారతీయుల గురించి నేను మాట్లాడటం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.