మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణం
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:37 AM
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగిసి బీజేపీ నేత వై.ఖేమ్‌చంద్ సింగ్ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. లోక్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు.
ఇంఫాల్, ఫిబ్రవరి 4: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగిసి బీజేపీ నేత వై.ఖేమ్‌చంద్ సింగ్ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. లోక్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. కుకీ తెగకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నేమ్చా కిప్‌జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఎల్.డిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. మహిళా ఉప ముఖ్యమంత్రి నేమ్చా కిప్‌జెన్ ఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు ఖేమ్‌చంద్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.