ఖర్గే దీపావళి శుభాకాంక్షలపై వివాదం
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:50 AM
దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. దీపావళిని ఖర్గే ‘ఖుషియోన్‌కా ఈద్’గా..
న్యూఢిల్లీ, నవంబరు 9: దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. దీపావళిని ఖర్గే ‘ఖుషియోన్‌కా ఈద్’గా అభివర్ణించటంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముస్లిం సమాజాన్ని బుజ్జగించటం కోసం హిందూమత సంప్రదాయాలను అవమానించటం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. దీపావళిని అదే పేరుతో పిలవటానికి సమస్య ఏమిటన్నారు. ఈద్‌ను ‘ఖుషియోన్‌కా దివాళి’గా పేర్కొనే ధైర్యముందా అని సవాల్ విసిరారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంచార్జి పవన్‌ఖేరా తిప్పికొడుతూ.. ఈద్ అనే పదానికి ఉన్న అర్థం పండుగ అని స్పష్టం చేశారు. ద్వేషాన్ని నింపుకొన్న సంఘీయులకు తప్ప ఇతరులకు ఎవరికీ ఖర్గే వ్యాఖ్యలతో సమస్య లేదన్నారు.