Share News

కేజీ బేసిన్‌ గ్యాస్‌ వివాదంలో మధ్యవర్తిగా జస్టిస్‌ రంజనా దేశాయ్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:02 AM

కృష్ణా- గోదావరి(కేజీ) బేసిన్‌ గ్యాస్‌ తరలింపు వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), మరో రెండు విదేశీ సంస్థలకు..

కేజీ బేసిన్‌ గ్యాస్‌ వివాదంలో మధ్యవర్తిగా జస్టిస్‌ రంజనా దేశాయ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 30: కృష్ణా- గోదావరి(కేజీ) బేసిన్‌ గ్యాస్‌ తరలింపు వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), మరో రెండు విదేశీ సంస్థలకు మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలీతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంలోని సాంకేతిక సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకొని ఇరు పక్షాలు సూచించే ఇద్దరు సబ్జెక్టు నిపుణుల సహాయాన్ని మధ్యవర్తి తీసుకోవచ్చని పేర్కొంది. మధ్యవర్తికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి హామీ ఇచ్చారు.

Updated Date - Oct 31 , 2026 | 03:04 AM