Share News

‘నక్సలిజం నిర్మూలన’పై నేడు లోక్‌సభలో కీలక చర్చ

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:27 AM

దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్రం ప్రకటించిన మార్చి 31 డెడ్‌లైన్‌కు ఒకరోజు ముందు.. ఇదే అంశంపై లోక్‌సభలో సోమవారం కీలక చర్చ జరగనుంది. ‘

‘నక్సలిజం నిర్మూలన’పై నేడు లోక్‌సభలో కీలక చర్చ

న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్రం ప్రకటించిన మార్చి 31 డెడ్‌లైన్‌కు ఒకరోజు ముందు.. ఇదే అంశంపై లోక్‌సభలో సోమవారం కీలక చర్చ జరగనుంది. ‘దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేసే ప్రయత్నాలు’ అనే అంశంపై జరిగే స్వల్పకాలిక చర్చలో కేంద్రం పూర్తి వివరాలను వెల్లడించనుంది. నక్సలిజం అంతానికి చేస్తున్న ప్రయత్నాలు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించనుంది. 193 నిబంధన కింద ఈ చర్చను టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే ప్రారంభించనున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం తాజాగా జరిపిన సమీక్షలో.. ఆయా జిల్లాల సంఖ్యను 8 నుంచి ఏడుకి తగ్గించింది. కాగా, 2004 నుంచి ఈ ఏడాది మార్చి 26 వరకు 16,496 మంది నక్సల్స్‌ లొంగిపోయారు. గత పదేళ్లలోనే 10వేల మంది, గతేడాది అత్యధికంగా 2,337 మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

Updated Date - Mar 30 , 2026 | 04:27 AM