Share News

ఇకపై వేతన ఆధారిత హెచ్‌-1బీ వీసాలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:04 AM

హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా కీలక మార్పులకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ ఉన్న ర్యాండమ్‌ విధానం నుంచి అత్యధిక వేతనాలు ఉన్నవారికి వీసా జారీచేసే విధానానికి .....

ఇకపై వేతన ఆధారిత హెచ్‌-1బీ వీసాలు

  • ఫాం ఐ-129కు సవరణలు... ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ, మార్చి 12: హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా కీలక మార్పులకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ ఉన్న ర్యాండమ్‌ విధానం నుంచి అత్యధిక వేతనాలు ఉన్నవారికి వీసా జారీచేసే విధానానికి మారుతున్న నేపథ్యంలో ఫాం ఐ-129 కొత్త వర్షన్‌ను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసింది. దీని ప్రకారం విదేశీ కార్మికుల కోసం పిటిషన్లు దాఖలు చేసే కంపెనీల యజమానులు వారికి ఇచ్చే ఉద్యోగానికి సంబంధించి మరింత వివరణాత్మక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సదరు ఉద్యోగానికి అవసరమైన కనీస విద్యార్హతలు, అధ్యయన విభాగం, ముందస్తు అనుభవం, పర్యవేక్షణ బాధ్యతలు తదితర వివరాలను సవరించిన ఫాంలో కంపెనీలు పేర్కొనాలి. ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌-1బీ ఫైలింగ్‌ కోసం ఈ కొత్త ఫాంలను మాత్రమే యూఎ్‌ససీఐఎస్‌ పరిశీలిస్తుంది. తాజా విధానంలో ఉద్యోగి వేతన స్థాయిని బట్టి రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యం కల్పిస్తారు. దీనికోసం వేతన వర్గీకరణ (1 నుంచి 4) ఆధారంగా దరఖాస్తులను విభజిస్తారు. ప్రారంభ స్థాయి ఉద్యోగులను లెవల్‌-1, అధిక నైపుణ్యం కలిగిన వారిని లెవల్‌-4గా పరిగణిస్తారు. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులతో పోలిస్తే మిగిలిన వారికి వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక వేతనం కలిగిన లెవల్‌-4 ఉద్యోగులకు నాలుగుసార్లు లాటరీలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

Updated Date - Mar 13 , 2026 | 04:04 AM