Share News

కేరళం మాజీ సీఎం విజయన్‌పై ఎఫ్‌ఐఆర్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:35 AM

కేరళం మాజీ సీఎం విజయన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రుటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) లంచం ఆరోపణల కేసులో విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణ టి, ఆమె భర్త, ప్రస్తుత సీపీఎం ఎమ్మెల్యే పి.ఎ. మహమ్మద్‌ రియాన్‌పై అనినీతి నిరోధక చట్టం కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజిలెన్స్‌ విభాగాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

కేరళం మాజీ సీఎం విజయన్‌పై ఎఫ్‌ఐఆర్‌
vijayan

కేరళం మాజీ సీఎం విజయన్‌పై ఎఫ్‌ఐఆర్‌

కొచ్చి, అక్టోబరు 9: కేరళం మాజీ సీఎం విజయన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రుటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) లంచం ఆరోపణల కేసులో విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణ టి, ఆమె భర్త, ప్రస్తుత సీపీఎం ఎమ్మెల్యే పి.ఎ. మహమ్మద్‌ రియాన్‌పై అనినీతి నిరోధక చట్టం కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజిలెన్స్‌ విభాగాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఐటీ కన్సల్టెన్సీ సేవల ముసుగులో సీఎంఆర్‌ఎల్‌ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌ సంస్థకు రూ.2.78 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగినట్టు ఆరోపిస్తూ ఈడీ సమర్పించిన నివేదికలో స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో తదుపరి ప్రాథమిక విచారణ అనవసరమని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Updated Date - Oct 10 , 2026 | 04:35 AM