శబరిమల పూజల్లో అక్రమాలపై ఆడిట్
ABN , Publish Date - May 19 , 2026 | 03:59 AM
శబరిమల ఆలయ పూజల నిర్వహణలో ఆర్థికపరమైన అక్రమాలు జరిగినట్టు సోమవారం కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. వీటిపై ఆడిట్ జరిపించాలని ఆదేశించింది.
కోచి, మే 18: శబరిమల ఆలయ పూజల నిర్వహణలో ఆర్థికపరమైన అక్రమాలు జరిగినట్టు సోమవారం కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. వీటిపై ఆడిట్ జరిపించాలని ఆదేశించింది. సామగ్రి కొనుగోలులోనూ అవకతవకలు జరిగినట్టు తెలిపింది. శబరిమల స్పెషల్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. పూజల్లో అక్రమాలు జరుగుతున్నట్టు ఓ భక్తుడు ఫిర్యాదు చేశారని, విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరిపినప్పుడు నిజమేనని తేలిందని పేర్కొంది. అష్టాభిషేకం పూజ కోసం లేత కొబ్బరికాయ,పాలు సహా 8వస్తువులకు రూ.300 వసూలు చేస్తున్నారు. అయితే దశాబ్దకాలం పాటు ఎలాంటి బిల్లులు లేకుండానే వీటిని కొనుగోలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాస పూజ, మకరవిలక్కు పూజల్లోనూ అక్రమాలు జరిగినట్టు తెలిపారు.