Share News

పినరయ్‌పై కేసు పెట్టండి

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:51 AM

లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కేరళ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయ్‌ విజయన్‌పై కేసు నమోదు చేయాలని కేరళం ప్రభుత్వం మంగళవారం పోలీసులను ఆదేశించింది

పినరయ్‌పై కేసు పెట్టండి
vijayan

పోలీసులకు కేరళం సర్కారు ఆదేశం

తిరువనంతపురం, సెప్టెంబరు 22: లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కేరళ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయ్‌ విజయన్‌పై కేసు నమోదు చేయాలని కేరళం ప్రభుత్వం మంగళవారం పోలీసులను ఆదేశించింది. ఆయన కుమార్తె వీణా టి, అల్లుడు పి.ఎ.మహమ్మద్‌ రియా్‌సలపైనా కేసు పెట్టాలని సూచించింది. ఎలాంటి సేవలు అందించనప్పటికీ సీఎంఆర్‌ఎల్‌ అనే ప్రయివేటు సంస్థ నుంచి సర్వీసు చార్జీల పేరుతో నెలవారీ సొమ్ము వసూలు చేశారని, ఇది లంచమేనని, అందువల్ల వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఇంతకుముందు ఈడీ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - Sep 23 , 2026 | 05:51 AM