Share News

కేరళలోని బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:37 AM

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా ముండత్తికోడ్‌లోని ఓ బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 13మంది చనిపోయారు..

కేరళలోని బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

  • 13 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

త్రిస్సూర్‌, ఏప్రిల్‌ 21: కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా ముండత్తికోడ్‌లోని ఓ బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 13మంది చనిపోయారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 40మంది దాకా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. త్రిస్సూర్‌లో 26న పూరమ్‌ పండుగ ఉంది. ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగ కోసమనే ముండత్తికోడ్‌లోని శివారు ప్రాంతాల్లోని బాణసంచా ఫ్యాక్టరీ వద్ద తాత్కాలిక షెడ్లను వేసి భారీ ఎత్తున బాణసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు ఓ షెడ్‌లో భారీ పేలుడు జరిగిందని, మంటలు మిగతా షెడ్లకు వ్యాపించాయని, బాణాసంచా పేలుళ్లు చాలా సేపు కొనసాగాయని స్థానికులు తెలిపారు.

Updated Date - Apr 22 , 2026 | 03:37 AM