ఓట్ల లెక్కింపు రోజుకు ముందు స్ట్రాంగ్ రూమ్‌లను తెర వొద్దు
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:50 AM
ఓట్ల లెక్కింపు రోజుకు ముందు కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను గానీ సీలు వేయని గదులను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని కేరళలలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు...
జిల్లాల ఎన్నికల అధికారులకు కేరళ సీఈవో ఆదేశం
తిరువనంతపురం, ఏప్రిల్ 21: ఓట్ల లెక్కింపు రోజుకు ముందు కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను గానీ సీలు వేయని గదులను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని కేరళలలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు మంగళవారం ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోజికోడ్‌లోని పెరాంబ్రా నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్ రూమ్‌ను తెరిచారని, అలాగే పలక్కాడ్‌లోని నెన్మారా నియోజకవర్గంలో మరో స్ర్టాంగ్ రూమ్‌ను తెరిచే యోచన ఉందన్న వార్తల నేపథ్యంలో కేరళ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రతన్ యూ కేల్కర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇండెక్స్ కార్డులను తయారు చేయడానికి గానీ, ఎన్‌కోర్ పోర్టల్‌లో డేటాను ధ్రువీకరించడానికి గానీ ఎలాంటి స్ర్ట్రాంగ్ రూమ్‌లను లేదా సీల్‌వేయని గదులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని పునరుద్ఘాటించారు. సంబంధిత అధికారులంటూ ఈ అదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరగ్గా.. మే 4న ఫలితాలను ప్రకటించనున్నారు..