కేంద్రీయ విద్యాలయాల్లో త్రిభాషా విధానం
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:38 AM
ప్రస్తుత విద్యా సంవత్సరం(2026-27)లో త్రి భాషా విధానం అమలులో భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తన పాఠశాలలన్నింటిలోనూ 6, 9 తరగతులకు కనీసం ...
న్యూఢిల్లీ, జూన్ 13: ప్రస్తుత విద్యా సంవత్సరం(2026-27)లో త్రి భాషా విధానం అమలులో భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తన పాఠశాలలన్నింటిలోనూ 6, 9 తరగతులకు కనీసం ఒక సంస్కృతం సెక్షన్‌ను నిర్వహించడం తప్పనిసరి చేసింది. త్రి భాషా విధానం(ఆర్3) కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు తీసుకునే ప్రక్రియను అన్ని కేంద్రీయ విద్యాలయాలు పూర్తి చేయాలని గత నెల 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. థర్డ్ లాంగ్వేజ్‌గా తప్పనిసరిగా సంస్కృతం లేదా ప్రాంతీయ/రాష్ట్ర భాష ఉండాలని, అందులోనూ షెడ్యూల్ భాషల నుంచి ఆర్1(హిందీ), ఆర్2(ఇంగ్లిష్) కాకుండా మరొకటి అయి ఉండాలని స్పష్టం చేసింది. ‘విద్యార్థులు తమ ప్రాధాన్యాన్ని బట్టి సంస్కృతం లేదా ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చు. బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లల సౌలభ్యం కోసం ప్రతి పాఠశాలలో కనీసం ఒక సంస్కృతం సెక్షన్ ఉండాలన్నదే ఈ నిబంధన’ అని ఓ సీనియర్ అధికారి వివరించారు.