హైకోర్టు విచారణకు హాజరవుతా: కేజ్రీవాల్
ABN , Publish Date - May 26 , 2026 | 04:01 AM
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులైన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, దుర్గేశ్ పాఠక్ తదితరులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ, మే 25: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులైన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, దుర్గేశ్ పాఠక్ తదితరులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ కేసును విచారిస్తున్న బెంచ్ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకొని.. ఆ బాధ్యతలను జస్టిస్ మనోజ్ జైన్ చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సోమవారం ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మనోజ్ జైన్.. నిందితుల తరఫున మూడు పిటిషన్లు దాఖలైనట్లు తెలిపారు. విచారణను జూలై 16వ తేదీకి వాయిదా వేశారు.