బీజేపీ పతనానికి కౌంట్‌డౌన్ మొదలు: కేజ్రీవాల్
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:17 AM
బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకు కౌంట్‌డౌన్ మొదలయిందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు.
న్యూఢిల్లీ, మార్చి 1: బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకు కౌంట్‌డౌన్ మొదలయిందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. అందర్నీ భయపట్టే నియంత తానే భయపడితే అది పరిపాలన అంతానికి సూచికలాంటిదని వ్యాఖ్యానించారు. మద్యం విధానం కుంభకోణం కేసును కోర్టు కొట్టివేయడాన్ని పురస్కరించుకొని ఆదివారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోదీ, అమిత్ షాలు కుట్ర పన్ని తనను మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు. అందర్నీ భయపెట్టిన మోదీ ఇప్పుడు తానే భయపడుతున్నారని అన్నారు. ‘