Share News

Keeravani: రిపబ్లిక్‌ డే పరేడ్‌ సంగీత దర్శకుడిగా కీరవాణి

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:49 AM

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈ నెల 26న నిర్వహించే వేడుకల్లో దేశంలో ఉన్న విభిన్న నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించేలా సుమారు 2,500 మంది కళాకారులతో...

Keeravani: రిపబ్లిక్‌ డే పరేడ్‌ సంగీత దర్శకుడిగా కీరవాణి

న్యూఢిల్లీ, జనవరి 19: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈ నెల 26న నిర్వహించే వేడుకల్లో దేశంలో ఉన్న విభిన్న నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించేలా సుమారు 2,500 మంది కళాకారులతో మహత్తర సాంస్కృతిక ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు సంగీతం అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

Updated Date - Jan 21 , 2026 | 05:03 PM