Share News

ఏప్రిల్‌ 22 నుంచి కేదార్‌నాథ్‌లో పునఃదర్శనాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:03 AM

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్‌ 22న ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో ..

ఏప్రిల్‌ 22 నుంచి కేదార్‌నాథ్‌లో పునఃదర్శనాలు

రుద్రప్రయాగ్‌, ఫిబ్రవరి 15: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్‌ 22న ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఈ తేదీని ఖరారు చేసినట్లు బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో సుమారు 6 నెలల పాటు మూసిఉంచే ఈ ఆలయ పునఃప్రారంభ తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించడం ఆనవాయితీ. కేదార్‌నాథ్‌ ఆలయం పునఃప్రారంభ తేదీ ప్రకటించడంతో చార్‌ధామ్‌ యాత్రకు షెడ్యూల్‌ ఖరారైంది. బద్రీనాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 23న, గంగోత్రి, యమునోత్రి ధామాలు ఏప్రిల్‌ 19న అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరుచుకోనున్నాయి.

Updated Date - Feb 16 , 2026 | 04:03 AM