Share News

బీజేపీకి లాభం చేకూర్చేలా మాట్లాడకండి

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:00 AM

బీజేపీకి లాభం చేకూర్చే లేదా సంతుష్ట పరిచే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, మీడియాతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మసలుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

బీజేపీకి లాభం చేకూర్చేలా మాట్లాడకండి

  • పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్‌ సూచన

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 9: బీజేపీకి లాభం చేకూర్చే లేదా సంతుష్ట పరిచే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, మీడియాతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మసలుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఇటీవల పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల కేరళలోని అలప్పుజలో కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. రాహుల్‌ను వేలెత్తి చూపినా లేక ఆయన గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేసినా ఎక్కువగా సంతోషించేది బీజేపీయేనన్నారు. మహారాష్ట్రలో శుక్రవారం శశిథరూర్‌ మాట్లాడుతూ రాహుల్‌ చేపట్టిన ఛత్రోంకీ గూంజ్‌ (విద్యార్థుల చైతన్య యాత్ర).. కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమం స్థాయిలో యవతను ఆకట్టుకోలేకపోయిందన్నారు. అయితే, థరూర్‌ ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారని తాను భావించడం లేదని వేణుగోపాల్‌ స్పష్టంచేశారు. ఇక ‘విదేశీ విరాళాల సవరణ బిల్లు’ను పార్లమెంట్‌లో ప్రవేశపెడితే, కాంగ్రెస్ తోపాటు విపక్షాలన్నీ కలసికట్టుగా అడ్డుకుంటాయని చెప్పారు.

Updated Date - Aug 10 , 2026 | 05:01 AM