ఆంథ్రోఫిక్ మాదే..!
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:50 AM
కర్ణాటకకు చెందిన ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ.. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సంస్థ...
న్యాయపోరాటానికి దిగిన కర్ణాటక స్టార్టప్ కంపెనీ
బెంగళూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు చెందిన ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ.. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సంస్థ ‘ఆంథ్రోపిక్’పై కేసు వేసింది. ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అయాజ్ ముల్లా.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘ఆంథ్రోపిక్ ఏఐ’ తమ బ్రాండ్ పేరును వాడుకుంటోందని ఆరోపిస్తూ బెళగావి కోర్టులో కేసు దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము బెళగావి కేంద్రంగా 2017లోనే కంపెనీని ప్రారంభించామని చెప్పారు. అయితే.. ఆంథ్రోపిక్ ఏఐను అమెరికాలో 2021లో స్థాంపించారన్నారు. తమ కంపెనీ సింబల్ ఆంథ్రోపిక్‌ను సోషల్ మీడియాతోపాటు, ప్లేస్టోర్ ఖాతాల్లోనూ వాడుతున్నామని, తమది స్టార్టప్ కర్ణాటక, స్టార్టప్ ఇండియాలో నమోదైన కంపెనీ అని చెప్పారు.