Share News

కర్ణాటకలో ఆర్డర్లీ వ్యవస్థ రద్దు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:22 AM

కర్ణాటక పోలీసుశాఖలో ఆర్డర్లీ విధానాన్ని రద్దు చేస్తూ డీజీపీ ఎంఏ సలీం గురువారం ఆదేశాలు జారీ చేశారు. బ్రిటీషువారి హయాంలో....

కర్ణాటకలో ఆర్డర్లీ వ్యవస్థ రద్దు

బెంగళూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పోలీసుశాఖలో ఆర్డర్లీ విధానాన్ని రద్దు చేస్తూ డీజీపీ ఎంఏ సలీం గురువారం ఆదేశాలు జారీ చేశారు. బ్రిటీషువారి హయాంలో సీనియర్‌ అధికారుల ఇళ్లలో కానిస్టేబుళ్లు వ్యక్తిగత పనులను చేయాల్సి వచ్చేది. ఈ పనులకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని వినియోగించేవారు. స్వాతంత్య్రం తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలలో ఈ ఆర్డర్లీ విధానం కొనసాగింది.

Updated Date - Mar 07 , 2026 | 04:22 AM