అన్ని రకాల ట్యాక్సీలకు మీటర్లు తప్పనిసరి
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:03 AM
ఆటోల తరహాలో కర్ణాటకలో అన్ని ట్యాక్సీలు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బైరతి సురేశ్ ఆదేశించారు.
కర్ణాటక రవాణా మంత్రి బైరతి సురేశ్ ఆదేశాలు
బెంగళూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆటోల తరహాలో కర్ణాటకలో అన్ని ట్యాక్సీలు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బైరతి సురేశ్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీలను వసూలు చేయాలన్నారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓలా, ఉబెర్ సహా అన్ని యాప్ బేస్డ్ ట్యాక్సీలు తప్పనిసరిగా మీటర్లు అమర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ ట్యాక్సీ సంస్థ కిలోమీటరుకు రూ.8 వసూలు చేస్తామని ప్రకటించడంపై ఆటోలు, క్యాబ్ అసోసియేషన్ల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.