సీజే రాయ్ ఆత్మహత్యపై సిట్
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:31 AM
కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
బెంగళూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర్ బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ఐటీ అధికారులు గతంలోనూ రాయ్ కంపెనీలపై దాడులు జరిపారని, 2025 డిసెంబరులో ఐటీ దాడి జరిగిందని, 60 రోజుల్లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు. ఐటీ అధికారులను విచారించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే అన్నారు.