Share News

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా కె.లక్ష్మణ్‌

ABN , Publish Date - May 26 , 2026 | 03:58 AM

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నియమితులయ్యారు. సోమవారం రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌..

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా కె.లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నియమితులయ్యారు. సోమవారం రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనను హౌస్‌ కమిటీ సభ్యుడిగా నామినేట్‌ చేసి, అనంతరం చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌ సంయుక్త కార్యదర్శి ఎ.కె. మాలిక్‌ ఎంపీ కె.లక్ష్మణ్‌కు లేఖ రాశారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీపీ రాధాకృష్ణన్‌కు, పార్టీ నాయకత్వానికి లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 26 , 2026 | 03:58 AM