Share News

రుతుక్రమ సెలవులపై చట్టం తెస్తే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:37 AM

మహిళలకు నెలసరి రుతుక్రమ సెలవులు ఇవ్వాలని చట్టం చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు.

రుతుక్రమ సెలవులపై చట్టం తెస్తే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరు

న్యూఢిల్లీ, మార్చి 13: మహిళలకు నెలసరి రుతుక్రమ సెలవులు ఇవ్వాలని చట్టం చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. అలాంటి చట్టబద్ధ నిబంధనలు ఉంటే మహిళలకు ఉద్యోగాలు ఎవరూ ఇవ్వరని అన్నారు. ‘యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. అలాంటి చట్టాన్ని ఆమోదిస్తే వారు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. దీన్ని ఓ బెడదగా భావిస్తారు’ అని చెప్పారు. తాము పురుషులకన్నా తక్కువన్న భావన కూడా మహిళా ఉద్యోగుల్లో కలుగుతుందని తెలిపారు. తప్పనిసరిగా నెలసరి సెలవులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలన్న వాజ్యంపై ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 04:37 AM