సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ పీఎస్ నరసింహ
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:15 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్. నరసింహ సుప్రీంకోర్టు ..
జస్టిస్ జె.కె. మహేశ్వరి పదవీ విరమణతో చోటు
న్యూఢిల్లీ, జూన్ 28: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్. నరసింహ సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులో ఐదో సీనియ ర్ న్యాయమూర్తిగా ఆయన 2028 మే 2న పదవీ విరమణ చేసే వరకు కొలీజియంలో కొనసాగుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.ఎస్ నరసింహ సభ్యులుగా ఉంటారు. 1963 మే 3న హైదరాబాద్‌లో జన్మించిన జస్టిస్ పీఎస్ నరసింహ.. నిజాం కళాశాలలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించి 1988లో న్యాయవాదిగా నమోదయ్యారు.