Share News

జేఎన్‌యూ వీసీపై నేడు విద్యార్థుల ‘రెఫరెండం’!

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:58 AM

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వైస్‌ చాన్స్‌లర్‌ శాంతిశ్రీ ధూళిపూడిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థి సంఘం....

జేఎన్‌యూ వీసీపై నేడు విద్యార్థుల ‘రెఫరెండం’!

న్యూఢిల్లీ, మార్చి 9: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వైస్‌ చాన్స్‌లర్‌ శాంతిశ్రీ ధూళిపూడిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మంగళవారం రెఫరెండం నిర్వహించనుంది. యూజీసీ తాజాగా విడుదల చేసిన ‘సమానత్వ’ నిబంధనల అమలుపై ఓ పాడ్‌కా్‌స్టలో వీసీ చేసిన కులపరమైన వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు అధ్యాపక సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. వీసీ వ్యాఖ్యలు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని, ఆమెకు పదవిలో కొనసాగే అర్హత లేదని విద్యార్థి సంఘం నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో 14 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో విద్యార్థులు రెఫరెండానికి పిలుపునిచ్చారు.

Updated Date - Mar 10 , 2026 | 04:58 AM