Share News

డీలిమిటేషన్‌కు జేఎంఎం మద్దతు?

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:20 AM

డీలిమిటేషన్‌ బిల్లులకు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డీలిమిటేషన్‌కు జేఎంఎం మద్దతు?

  • జేఎంఎంకు లోక్‌సభలో 3, రాజ్యసభలో 3 స్థానాలు

న్యూఢిల్లీ, నవంబరు 29: డీలిమిటేషన్‌ బిల్లులకు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సోరెన్‌ సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బిల్లులను పూర్తిగా పరిశీలించి జార్ఖండ్‌ ప్రయోజనాలపై ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత వైఖరిని ప్రకటిస్తామని పేర్కొన్నాయి. ప్రతిపక్ష ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న జేఎంఎంకు లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ముగ్గురు కలిపి ఆరుగురు ఎంపీలున్నారు. 50శాతం సీట్ల పెంపుతో జార్ఖండ్‌లో ప్రస్తుతమున్న 14 లోక్‌సభ స్థానాలు 21కి పెరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతమున్న 5 ఎస్టీ రిజర్వుడు స్థానాల సంఖ్య కూడా పెరుగుతుందని జేఎంఎం ఆశిస్తోంది. గిరిజన ప్రాతినిధ్యానికి ప్రయోజనం కలిగితే బిల్లులకు మద్దతు ఇవ్వాలన్న దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, డీలిమిటేషన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ)ల తర్వాత మరో ఎదురుదెబ్బ తగిలినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 30 , 2026 | 03:21 AM