పోలీస్ స్టేషన్‌పై సైనికుల దాడి
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:57 AM
పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, సిబ్బందిని గాయపరిచారన్న ఆరోపణలతో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ సహా పలువురు సైనికులపై కేసులు నమోదయ్యాయి.
జమ్మూ, జూన్ 25: పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, సిబ్బందిని గాయపరిచారన్న ఆరోపణలతో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ సహా పలువురు సైనికులపై కేసులు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వాడ్ జిల్లా అథోలి పోలీసు స్టేషన్‌పై దాడి జరిగినట్టు గురువారం పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో ఓ ఆర్మీ అధికారికి చెందిన ప్రయివేటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడమే దీనికంతటికీ కారణమయింది. తాను అధికారిక సమావేశానికి పద్దార్ పట్టణానికి వెళ్లినప్పుడు ఈ ‘క్రిమినల్ కుట్ర’ చోటుచేసుకుందని ఆ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అమృత్ కోటచ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదయ్యాయి.