Share News

జనగణన రూల్స్‌ మార్పు వెనుక ఆర్‌ఎస్ఎస్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:14 AM

జనాభా లెక్కల కోసం ఎన్యూమరేటర్ల అర్హత జాబితాను విస్తరిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేష్‌ ఆరోపించారు.

జనగణన రూల్స్‌ మార్పు వెనుక ఆర్‌ఎస్ఎస్‌

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల కోసం ఎన్యూమరేటర్ల అర్హత జాబితాను విస్తరిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేష్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నోటిఫికేషన్‌ పూర్తిగా ఆర్‌ఎస్ఎస్‌ , బీజేపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా ఉందని, ఇది పరోక్షంగా వారికి కల్పించిన ఉపాధి హామీ పథకం లాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్ఎస్‌ క్యాడర్‌ను జనగణన ప్రక్రియలోకి దూర్చేందుకే కేంద్రం ఇప్పుడు నిబంధనలు మార్చిందని ఆరోపించారు. గతంలో సర్‌ డేటాను మార్చేసినట్లే, ఇప్పుడు దేశానికి అత్యంత కీలకమైన జనగణన డేటాను కూడా వారికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాని, హోం మంత్రి స్కెచ్‌ వేశారని జైరాం రమేష్‌ ఆరోపించారు.

Updated Date - Oct 18 , 2026 | 06:17 AM