Share News

గుజరాత్‌ పోర్టుకు చేరిన జగ్‌ లాడ్కీ

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:41 AM

ముడి చమురుతో మరో భారీ నౌక ‘జగ్‌ లాడ్కీ’ భారత్‌కు చేరింది. దాదాపు 80,800 టన్నుల ముడిచమురుతో ఎట్టకేలకు గుజరాత్‌ తీరానికి అది చేరుకుంది...

గుజరాత్‌ పోర్టుకు చేరిన జగ్‌ లాడ్కీ

  • యుద్ధం తర్వాత భారత్‌కు మూడో ఓడ ఇది

న్యూఢిల్లీ, మార్చి 18: ముడి చమురుతో మరో భారీ నౌక ‘జగ్‌ లాడ్కీ’ భారత్‌కు చేరింది. దాదాపు 80,800 టన్నుల ముడిచమురుతో ఎట్టకేలకు గుజరాత్‌ తీరానికి అది చేరుకుంది. యూఏఈ గుండా సుదీర్ఘ ప్రయాణం చేసి బుధవారం ఇక్కడి ముంద్రా పోర్టుకు చేరింది. ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్టు గత శనివారం ఇరాన్‌ క్షిపణి దాడికి గురైంది. ఆయిల్‌ టెర్మినల్‌ లక్ష్యంగా దాడి జరగడంతో, పోర్టులో కార్యకలాపాలు తాత్కాలికంగా స్తంభించాయి. ఈ దాడి జరిగిన మరునాడు, ఆదివారం, పోర్టు నుంచి జగ్‌ లాడ్కీ నౌక ముడి చమురుతో బయలుదేరింది. యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన మూడో ముడి చమురు నౌక ఇది కావడం విశేషం.

Updated Date - Mar 19 , 2026 | 06:42 AM