Share News

ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహ తొలి కక్ష్య పెంపు సక్సెస్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:15 AM

ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం అంతరిక్షంలో తన తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని షార్‌ నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు..

ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహ తొలి కక్ష్య పెంపు సక్సెస్‌

సూళ్లూరుపేట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం అంతరిక్షంలో తన తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని షార్‌ నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా విజయవంతంగా రోదసీలోకి పంపిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు శనివారం సాయంత్రం 4.48 గంటలకు ఉపగ్రహంలోని లిక్విడ్‌ అపోజీ మోటారు(లామ్‌) ఇంజన్‌ను మండించి, తొలి దశ కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2174.8 సెకన్ల పాటు సాగిన ఈ ఇంజన్‌ జ్వలన ప్రక్రియతో ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం భూమి నుంచి 5,477 కి.మీ. ఎత్తుకు చేరింది. ఉపగ్రహాన్ని సుమారు 37,833 కిలో మీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి చేర్చే ప్రక్రియలో ఇది మొదటిది. కక్ష్య పెంపు అనంతరం ఉపగ్రహ పనితీరు బాగుందని ఇస్రో తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా, నావిగేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఐదు నెలల్లో ఎన్‌వీఎస్‌-04, 10 నెలల్లో ఎన్‌వీఎస్‌-05 ఉపగ్రహాలను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

Updated Date - Nov 01 , 2026 | 03:16 AM