శాటిలైట్లు, అంతరిక్ష ఆస్తులపై నిఘా కోసం అసోంలో అడ్వాన్స్‌డ్ రాడార్ రిసెర్చ్ ఫెసిలిటీ
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:56 AM
దేశ రక్షణ, నిఘా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసేలా ఇస్రో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో తన ఉపగ్రహాలు, ఇతర కీలక ఆస్తుల రక్షణ కోసం అసోంలో ఒక ..
బెంగళూరు, అక్టోబరు 2: దేశ రక్షణ, నిఘా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసేలా ఇస్రో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో తన ఉపగ్రహాలు, ఇతర కీలక ఆస్తుల రక్షణ కోసం అసోంలో ఒక అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. గువాహటి శివార్లలోని చంద్రాపూర్ వద్ద అడ్వాన్స్ రాడార్ రిసెర్చ్ ఫెసిలిటీ(ఐఏఆర్‌ఆర్‌ఎఫ్) నిర్మాణ పనులను ప్రారంభించింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ సమక్షంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల దీనికి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ నేత్రలో భాగంగా పనిచేస్తుంది. అంతరిక్షంలో భారత్‌కు చెందిన ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు, అంతరిక్ష వ్యర్థాల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ఇది అందుబాటులోకి వస్తే అంతరిక్ష ఆస్తుల రక్షణతోపాటు ఈ కేంద్రంలో ఏర్పాటు చేసే అత్యాధునిక రాడార్ సాంకేతికత ద్వారా వాతావరణ మార్పులు, మేఘాల కదలికలు, తుఫానులు, వాతావరణ హెచ్చరికలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చు.