Share News

మోదీ పర్యటనకు,ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:50 AM

ప్రధాని మోదీ ఇజ్రాయిల్‌ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదని భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ తెలిపారు.

మోదీ పర్యటనకు,ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు

  • భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి రూవెన్‌

న్యూఢిల్లీ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఇజ్రాయిల్‌ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదని భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ తెలిపారు. మోదీ పర్యటన ముగిసిన రెండు రోజులకు ఈ ఆపరేషన్‌ చేపట్టేందుకు తమకు అవకాశం చిక్కిందన్నారు. భారత్‌లో ఇంధన కొరత, ఇతర సమస్యల గురించి తమకు తెలుసునని, కాని దీర్ఘకాలిక దృష్ట్యా చూస్తే ఇరాన్‌లో పరిస్థితులు చక్కబడితే మొత్తం ప్రపంచానికి మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని, కాని ఇప్పటికే ఇరాన్‌ బలహీనపడిందన్నారు. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని, తాను ఇటీవలే ఇజ్రాయిల్‌లో ఆయనను కలిశానని చెప్పారు. తాము సామాన్య ప్రజలపై దాడులు చేయాలనుకోవడం లేదని, ఇరాన్‌ మాత్రం ఇతర దేశాల విమానాశ్రయాలపై దాడులు చేస్తోందని చెప్పారు.

Updated Date - Mar 17 , 2026 | 03:50 AM